Featured
Posted in Poetry, Telugu Poetry

అందమైన అక్షరాలతో…

అందమైన అక్షరాలతో
పొందికగా రాయడం నాకు తెలియదు!
కాని ఆ అక్షరాల్లో దాగిన నా మనసుభావాలను
మీరర్థం చేసుకుంటే నాకదే చాలు!!

– J Swethagodawari©®™
– 26/01/2020

Posted in Love Poetry, Poems Dedicated to family and friendz, Poetry, Telugu Poetry

నిను ఎన్నటికీ మరవలేను..

ఎలా మరచిపోగలను?
నీవు నా జీవితంలో ఒక భాగమయ్యావు
ఎలా మరచిపోతాను?

ఎక్కడినుండి వచ్చావో తెలియదు
ఆరోజు మా ఇంటికెందుకొచ్చావో తెలియదు
నీ అమాయకపు ప్రేమామాయాజాలంలో చిక్కుకున్న నేను..
నీకు ఎప్పుడు అంతగా ఎలా దగ్గరయ్యానో తెలియలేదు
నీ ముద్దు ముద్దు రాగాలు నాకు సరాగాల్లా వినిపించేవి
నీ అమాయకపు కళ్ళను చూస్తూ అలాగే ఉండిపోవాలనిపించేది

కసురుకొని ప్రక్కకు తోసేసినా
నా ఒళ్ళోకి వచ్చి చేరడం
నీకిష్టమైన ఆహారం నీముందున్నా
నేను తింటున్న రస్క్ మాత్రమే కావాలని మారం చేయడం
ఆశ పెట్టినా.. ఆశ పెడ్తున్నట్టు నటించినా
అది నిజమనుకొని అమాయకంగా నా చెంతకు చేరడం
నీతో దాగుడుమూతల ఆటలు..
నీతో నేను గడిపిన రోజులు..
నేను కనిపించకపోతే నువ్వు నాకోసం వెతికావో లేదోగానీ
నువ్వు నా ముందు కనిపించకపోతే..
ఎక్కడెక్కడ నా మనసు వెతికేదో నీకు తెలుసునా?
పరిస్థితుల వలన నేను నిన్ను వదిలివేసిన క్షణం నుండి
కొన్ని రోజుల వరకు నా నవ్వులు కూడా దూరమయ్యయని నీకు తెలుసునా?
నా మనసు భావాలను ఎలా తెలుపను నీకు?
నాకు నేనే ఇలా తలచుకుంటూ డైరీలో రాసుకోవడం తప్ప!
నీ మనసు భావాలు, మూగ సైగలు నాకర్థమైనా
నేను రాస్తున్న ఈ మాటలు నీకెన్నటికీ అర్థం కావు
ఎందుకంటే నువ్వు మా బుజ్జి పిల్లిపిల్ల "మ్యావ్ మ్యావ్" కనుక
నీకు "మ్యావ్ మ్యావ్" అనడం తప్ప ఇంకేమీ రాదుగనుక!😘

- J Swethagodawari©®™
28/02/2022
Posted in Poetry, Telugu Poetry

మతం – మారణహోమాలు

ప్రతీ పుణ్యక్షేత్రం వ్యాపారకేంద్రమే!
ప్రతీ మతం ధ్యేయం ఇతర మతాలమీద ఆధిపత్యమే!
మానవత్వం కన్నా మతం ముఖ్యమనే భ్రమలో బ్రతుకుతున్న పిచ్చి భక్తులు...
ఆ పిచ్చికి పరాకాష్టే తోటి మానవులపై కొనసాగుతున్న మారణహోమాలు!!

- J Swethagodawari©®™
@ 25/02/2022
Posted in Memories

గండిపేట్ చెరువు అందాలు…

నాలుగు సంవత్సరాల క్రితం నేను నా స్నేహితురాలితో కలిసి చిలుకూరి బాలాజీ దేవాలయ దర్శనానికై వెళ్ళినప్పుడు, అక్కడున్న గండిపేట్ చెరువును చూశాను. మొదటిసారిగా ఈ చెరువును చూడగానే చాలా సంతోషమేసింది. పైగా వర్షాకాల సాయంత్ర సమయమది. చల్లటి వాతావరణం మరియు ఆకాశమంతా మబ్బులతో అలుముకుంది. ఆ సమయంలో నేను నా మొబైల్ కెమరాతో తీసిన చిత్రాలు….